అక్కినేని నాగార్జున ఆగ్రహం మంత్రి కొండా సురేఖ పై
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున గారు, తెలంగాణ మంత్రి అయినటువంటి కొండా సురేఖను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “మమ్మల్ని మీ యొక్క రాజకీయాల్లోకి లాగకండి. మామానాన మమ్మల్ని వదిలేయండి” అంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో నాగార్జున చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది అని చెప్పొచ్చును. అసలు సురేఖ గారు ఏమన్నారు? అక్కినేని ఎందుకు రియాక్ట్ అయ్యాడు అనేది ఆసక్తిగా మారింది.
ఏం జరిగింది తెలుసుకుందాం?
మంత్రి కొండా సురేఖ, BJP MP రఘునందన రావు కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో రఘునందనరావు… సురేఖ మెడలో ఓ దండ వేశారు. దీనికి సంబంధించిన ఫొటోను.. మార్ఫింగ్ చేసి.. తనను అపఖ్యాతి పాల్జేసేలా వ్యవహరించారని మంత్రి సురేఖ బీఆర్ఎస్ నాయకులపై ముఖ్యంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పై మంగళవారం నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే అందరికీ. మీడియా మిత్రుల సమావేశంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. “షాదీ జీహాద్” అంటూ వ్యాఖ్యానించడాన్ని ఆమె మరింత బాధపడ్డారు. దీనికి కొనసాగింపుగా మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం పై విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున ఫ్యామిలీ కి సంబంధించిన కీలకమైన రెండు విషయాలను సురేఖ ప్రస్తావించారు. 1) నాగచైతన్య-సమంత దంపతుల విడాకులు. 2) ఎన్-కన్వెన్షన్. ఈ 2 విషయాలను ప్రస్తావిస్తూ.. మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రంగా సురేఖ తీవ్ర విమర్శలు చేశారు. నాగచైతన్య, సమంత దంపతులు విడిపోవడానికి అప్పటి మంత్రి KTR కారణమని మంత్రి సురేఖ ఆరోపించారు. ఇక, అప్పట్లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండేందుకు. నాగార్జున బీఆర్ఎస్ కు దాసోహం చేశారని తీవ్రంగా రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన షరతులకు అక్కినేని ఒప్పుకొన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు జోరుగా వైరల్ అయ్యారు.
అక్కినేని నాగార్జున రియాక్షన్
మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని వెంటనే రియాక్ట్ అయ్యారు. సహజంగా ఆయన వెంటనే రియాక్ట్ కావడం అనేది లేదు. కానీ, ఈ విషయంలో మాత్రం ఆయన అక్షణమే స్పందించారు. ‘గౌరవనీయ మహిళా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని పేర్కొంటూ.. ఆమె తీరును ఎండగట్టారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించేందుకు వాడుకోవద్దంటూ ఆయన సూచన చేయడం జరిగింది. అంతేకాదు.. బాధ్యత కలిగిన పదవి లో ఉన్న మంత్రిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదన్నారు. మా కుటుంబం పట్ల సురేఖ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు పూర్తిగా అబద్ధమని వివరించారు. తక్షణమే మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అక్కినేని నాగార్జున డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి సురేఖఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.