బుల్డోజర్ రాజ్ ఆపు.. ఇది రాహుల్ సార్ మాట..
తెలంగాణలో బుల్డోజర్ రాజ్ ఆపేయాలని AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కడకండిగా చెప్పడం జరిగింది. ఇది తాను చెప్తోన్న మాట కాదని.. పార్టీ ముఖ్యనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట అని స్పష్టం చేశారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో వేలది కుటుంబాలను తరలించే ప్రయత్నాలపై మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించాలని రాహుల్ గాంధీ కబురు పంపారు. రాహుల్ ఆదేశాల మేరకు కేసీ వేణుగోపాల్ అర్జంట్ గా ఢిల్లీకి రావాలని రేవంత్ కు సూచించారు జరిగింది.
సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అవ్వడం జరిగింది. ఇటీవల జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఖర్గేను రేవంత్ పరామర్శించారు అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు సోదరుడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూల్చేసినప్పుడే తనని మందలించామని రేవంత్ కు గుర్తు చేశారు. అప్పుడే జాగ్రత్త పడి ఉంటే పరిస్థితి ఇప్పుడు ఇంతవరకూ వచ్చేది ఉండేది కాదని ఖర్గే సీఎం రేవంత్ తో అన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారు. పేదల ఇండ్ల కూల్చివేతలపై ఇంత మొండిగా వెళ్లడం ఏమిటని కూడా ఖర్గే ప్రశ్నించినట్టుగా తెలిసింది.
పార్టీకి చెడ్డపేరు తెచ్చుకునే ప్రయత్నాలు మానుకోవాలని, మంచిగా వ్యవహరించాలని.. రేవంత్ దూకుడు తగ్గించుకోవాలని ఖర్గే స్పష్టం చేసినట్టు తెలిసింది. రేవంత్ వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేసినా వాటిని ఆయన వినిపించుకోలేదని తెలుస్తుంది.
అక్కినేని నాగార్జున ఆగ్రహం మంత్రి కొండా సురేఖ పై